వెంకటేష్ సినిమాలో నారా రోహిత్ విలన్

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన బాధ్యతను దర్శకుడిగా తేజకి బాలకృష్ణ అప్పగించారు. ఈ సినిమాకి ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు కంటే ముందుగా వెంకటేశ్ తో ఒక సినిమా చేయడానికి తేజ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే టైటిల్ ను పరిశిలీస్తున్నట్టుగా సమాచారం.
ఇక కథానాయికాగా అనుష్కను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం నారా రోహిత్ విలన్ గా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుందట. ఆ పాత్రకి నారా రోహిత్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించిన తేజ, ఆయనని ఒప్పించాడని అంటున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న నారా రోహిత్ .. ఈ సినిమాలో విలన్ గా చేయడానికి ఓకే అనడం విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here