సక్సెస్ ల మీద సక్సెస్ లతో ఎన్టీఆర్ తో రోమాన్స్ కి సిద్దమైంది

ఈ మధ్యకాలంలో తెలుగు తెరకు పరిచయమైన కథానాయికలలో మెహ్రీన్ సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె నటించిన  ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ .. ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్’ వరుస విజయాలను అందుకున్నాయి. వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘జవాన్’ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మెహ్రీన్ డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.
 ఇక త్రివిక్రమ్ కూడా తన నెక్స్ట్ మూవీలో కథానాయిక పాత్ర కోసం మెహ్రీన్ పేరును పరిశీలిస్తున్నాడట. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే ఆయన మెహ్రీన్ పేరును పరిశీలిస్తున్నాడని అంటున్నారు. దాదాపు ఆమెని ఖరారు చేయవచ్చనీ .. అదే జరిగితే ఆమె దశ తిరిగినట్టేనని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు వినిపించింది. మరి, ఆమె స్థానంలోనే మెహ్రీన్ ను తీసుకుంటారా? లేదంటే మరో కథానాయికగా ఎంపిక చేసుకుంటారా? అనే విషయంలోనే స్పష్టత రావలసి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here