” రవితేజ విషయం లో నాకు ఎప్పుడూ ఈర్ష్య లేదు “

“రవితేజ .. మీరు ఒకేసారి కెరియర్ ను మొదలుపెట్టారు. రవితేజ సూపర్ స్టార్ అయ్యారు .. మీకు స్టార్డమ్ రాలేదు. ఈ విషయంలో ఎప్పుడైనా ఫీలవుతుంటారా? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీకి ఎదురైంది. అందుకాయన ఇలా స్పందించారు. ” సిందూరం’ సినిమాలో నాది సీరియస్ పాత్ర .. రవితేజ ఫన్ తో కూడిన పాత్ర చేశాడు. అందువలన ఆ పాత్రకి మంచి పేరొచ్చింది .. ఎక్కువ గుర్తింపు లభించింది.
 “అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన ఆ తరువాత ఇద్దరం కూడా కష్టాలు పడ్డాం. ‘మనసిచ్చి చూడు’ సినిమాలో రవితేజ చేసిన పాత్ర వర్కౌట్ కావడం .. ఆ తరువాత ఆయన పూరీ జగన్నాథ్ కి కనెక్ట్ కావడం జరిగింది. ‘సిందూరం’లోని ‘చంటిగాడు’ పాత్రను రవితేజతో పూరీ బాగా యుటిలైజ్ చేసుకున్నాడు.
పూరీ సినిమాల వలన రవితేజ స్టార్ కావడం జరిగింది. రవితేజ పైకి వచ్చేశాడు .. నేను రాలేదు అనే ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. ఎందుకంటే పెద్ద హీరోనైపోదామని నేను రాలేదు. రవితేజ పైకి వచ్చాడనే బాధలేదు .. నేను కూడా వస్తే బాగుండేదనే ఫీలింగ్ ఓ ఫైవ్ పర్సెంట్ ఉంటుందేమో .. అంతే” అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here