నా ఫోటో చూసి డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసారు .. అప్పుడు నా వయసు ..

‘బిగ్ బాస్’ షోకి ముందు పెద్దగా జనాలకి తెలియని హరితేజ, ఆ తరువాత అందరికీ తెలిసిపోయింది. ఈ షోలో పాల్గొనడం వలన ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా కమెడియన్ అలీ షోకి వచ్చిన ఆమె, తాను నటన వైపుకు రావడానికి దారితీసిన పరిస్థితులను గురించి చెప్పుకొచ్చింది.
“నాకు క్లాసికల్ డాన్స్ లో మంచి ప్రవేశం వుంది .. హైదరాబాద్ – రవీంద్రభారతిలో జరిగిన క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ లో నేను పాల్గొన్నాను. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత కొందరు నా ఫోటోలు తీశారు. ఆ ఫోటోలే సినిమా ఆఫీసులకి వెళ్లిపోయాయి. అదే సమయంలో ..  ఓ సీరియల్ వారు కొత్త అమ్మాయి .. తెలుగు అమ్మాయి కోసం వెతుకుతున్నారు.
వాళ్లు నా ఫోటోలు చూసి ఎవరీ అమ్మాయి అంటూ ఆరాలు తీశారు. ఫోన్ చేసి పిలిపించమని చెప్పడంతో .. వాళ్లు నన్ను పిలిపించారు. అప్పుడు నేను పదో క్లాసే చదువుతున్నాను. మొదటి నుంచి మంచి డాన్సర్ ను కావాలనే కోరిక బలంగా ఉండేది .. కానీ నన్ను ఇలా ఆర్టిస్టును చేసేశారు” అంటూ నవ్వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here