విజయ్ మరణం మీద రియాక్ట్ అయిన రవిబాబు

ప్రముఖ హాస్యనటుడు విజయ్ సాయి లేడనే వార్తను తట్టుకోలేకపోతున్నానని, ఆ బాధ నుంచి ఎప్పటికి కోలుకుంటానో కూడా తనకు తెలియదని దర్శకుడు రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం విజయ్ సాయి అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయ్ మరణం..షేర్ చేసుకోలేనంత బాధాకరమని,విజయ్ ని వెతికి పట్టుకుని, నటనలో శిక్షణ ఇచ్చి, సినీ ఇండస్ట్రీకు పరిచయం చేసింది తానేనని, అతను తనకు బేబీ లాంటివాడని అన్నారు.
తన లైఫ్ లో చాలాకాలం అతనితో గడిపానని, విజయ్ లో గొప్ప లక్షణం ఏంటంటే, ఎంత బాధాకరమైన విషయాన్నయినా నవ్వుతూ చెబుతాడని అన్నారు. ఏ తల్లిదండ్రులు అయినా సరే, వాళ్లు బతికుండగానే వాళ్ల పిల్లలు చనిపోవడం చూడకూడదని, అంతకంటే బాధాకరమైన విషయం మరోటుందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here