మోడీ కోసం వెళ్ళింది అని పెళ్ళానికి తలాక్ చెప్పేసాడు

గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త తలాకు చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా నిన్న నిర్వహించిన ర్యాలీలో ఫయ్ రా అనే ముస్లిం మహిళ పాల్గొంది. ర్యాలీ ముగిసిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిన తనకు తన భర్త డానిష్ తలాక్ చెప్పేశాడని వాపోయింది. తనను, తన కుమారుడిని తీవ్రంగా గాయపరచి ఇంటి నుంచి గెంటేశాడని విలపించింది.

ట్రిపుల్ తలాక్ విషయంలో మోదీ ఏం చేయలేడని ఆమె భర్త తనతో అన్నాడని చెప్పింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. కాగా, ట్రిపుల్ తలాక్ పై చట్టం చేస్తామని మోదీ చెప్పడం వల్లే ఆయనకు మద్దతిస్తూ ఆ ర్యాలీలో పాల్గొన్నానని ఫయ్ రా పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఆమె భర్త డానిష్ స్పందిస్తూ, మోదీ ర్యాలీలో తన భార్య పాల్గొన్నందుకు తలాక్ చెప్పలేదని, ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నందువల్లే వైవాహిక బంధానికి ముగింపు పలికానని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here