సంక్రాంతి నుంచి రవితేజ తప్పుకున్నాడు ..

రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ నటిస్తోన్న సినిమా టచ్ చేసి చేసి చూడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని ఈ మూవీ సంక్రాంతికి విడుదల అవ్వడం లేదు.
తాజా సమాచారం మేరకు టచ్ చేసి చూడు సినిమాను జనవరి 25 న విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. జనవరి 26 న రవితేజ పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను 25న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసున్నట్లు సమాచారం. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్‌ నటిస్తున్న ఈ మూవీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here