మొదటి రోజు ఏడున్నర కోట్లు .. నాని విశ్వరూపం

నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించింది. నేచురల్ స్టార్ గా నానికి ఎంతో ఇమేజ్ వుంది .. ఇక ‘ఫిదా’తో సాయి పల్లవి క్రేజ్ కూడా పెరిగిపోయింది. దాంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి వుంది.
ఈ కారణంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలిరోజున ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7.54 కోట్లను రాబట్టినట్టు సమాచారం. నాని ఎంపిక చేసుకునే కథలు .. పాత్రలు విభిన్నంగా వుంటాయనే నమ్మకం ఆడియన్స్ లో వుంది. అందువలన ఈ సినిమాలోనూ కొత్తదనం ఉంటుందని వాళ్లు భావించారు. ఈ కారణంగానే ఈ సినిమా తొలిరోజున ఈ స్థాయి వసూళ్లను సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here