జరుగుతోంది ఒకటి దిల్ రాజు చెప్పేది ఒకటి …

ఎంసీఏ నిర్మాత అయినా దిల్ రాజు విడుదలైన ఎంసీఏ సినిమా గురించి అనేక విశేషాలు చెప్పుకొచ్చాడు. ఈ సంవత్సరం తను నిర్మించిన ఆరు సినిమాలు భారీ విజయం చూశాయని. ఆరో సినిమాగా వచ్చిన ఎంసీఏ విజయంతో ఇది రుజువు అయింది అని అన్నారు నిర్మాత దిల్ రాజు.ఎంసీఏ సినిమా హిట్ అయిందని ఫస్ట్ పాజిటివ్ టాక్ తెల్లవారుజాము 4గంటలకు న్యూజెర్సీ నుంచి వచ్చిందని నిర్మాత దిల్ రాజు చెప్పాడు.సినిమాలో సెకండాఫ్ కొద్దిగా డల్ అనిపించినా క్లైమాక్స్ చూసి అందరు మెచ్చుకుంటున్నారు అని రాజు చెప్పారు.

రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ల నేను లోకల్ సినిమా కంటే ఎక్కువ వసూలు చేస్తుందని చెప్పారు అని దిల్రాజు అన్నారు.ఎవరెంత చెప్పినా ఒక సినిమాకు ఎంత ఖర్చు పెట్టాం ఎంత వసూలైంది అన్నదే తాను చూస్తానని.. ‘ఎంసీఏ’కు ఊహించని స్థాయిలో వసూళ్లు చేస్తుంది అని ముందు ముందు ఈ వసూళ్ళ పరంపర కొనసాగుతుంది అని దిల్ రాజు చెప్పారు. అయితే బయట టాక్ మాత్రం ఆయన చెబుతున్న దానికి పొంతన గా ఎక్కడ కనపడ్డం లేదు. క్లైమాక్స్ బాగా పేలవంగా ఉండడమే కాకుండా సినిమాలో కామెడీ కూడా సరిగ్గా పెలకపోవడం తో ఈ సినిమా వసూళ్లు రెండో రోజుకే డ్రాప్స్ పడ్డాయి. ఇక ఈ సినిమా లాంగ్ రన్ కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here