సంజయ్ దత్ కు ‘వదల బొమ్మాలి’ గొంతు..!

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో వచ్చిన ‘కేజీఎఫ్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ కు సంబంధించి షూటింగ్ ని పూర్తి చేశారట. ఎడిటింగ్ కూడా పూర్తయిందట.

కాగా తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు రవి శంకర్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అదేనండి ‘వదల బొమ్మాలి’ అంటూ అరుంధతిలో ఆకట్టుకున్న సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్. ఇక అధీరా పాత్ర సినిమాకే హైలెట్ కానుందని సమాచారం. మరి కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here