మీరు నన్ను ప్రేమిస్తే.. ఎగరనివ్వండి!

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార రష్మిక మందన్న..తనదైన క్యూట్‌ నటనతో ఆకట్టుకునే ఈ చిన్నది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో అగ్ర కథనాయికల సరసన ఒకరిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది.. ప్రస్తుతం బన్నీ సరసన ‘పుష్ప’ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సీతాకోకచిలుక పెయింటింగ్‌ మధ్య నిలబడి తీసిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. `మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టైతే నా రెక్కలు కత్తిరించకండి.. నన్ను ఎగరనివ్వండి` అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here