నేను ఏలియన్ అనుకుంటా: రష్మిక 

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి రష్మిక మందన. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు జవాబులిచ్చింది.

ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన.. ‘మీలో మీకు చిరాకుగా అనిపించే లక్షణం?’ అన్న ప్రశ్నకు స్పందించిన రష్మిక మాట్లాడుతూ… ‘అలాంటివి చాలా ఉన్నాయి. ప్రతి దానికీ ఎక్కువ ఆలోచిస్తా. బాధపడతాను. ఇక ఎటువంటి సందర్భంలో అయినా నవ్వుతూనే ఉంటా. అది చాలా మందికి అయోమయంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు బాగా ఒత్తిడిగా అనిపిస్తే హైపర్‌ అవుతాను. నా మెంటాల్టీ కొంచెం విచిత్రంగా ఉంది కదూ? నేను ఏలియన్‌ అనుకుంటా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. ఇక మరో అభిమాని అడిగిన ‘మీ స్ట్రెస్‌బస్టర్‌ ఏంటి?’… అన్న ప్రశ్నకు జవాబిస్తూ… ‘బాగా స్ట్రెస్‌ అనిపిస్తే వర్కౌట్స్‌ చేస్తా. అలాగే సంగీతం వింటాను. పిచ్చిపట్టినట్టు డ్యాన్స్‌ చేస్తాను. అంతే.. ఒత్తిడి మాయం అయిపోతుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here