మోదీ ఒక్క‌నికే రూ.517 కోట్లు.. మిగిలిన సభ్యుల ఖ‌ర్చెంత‌..?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌నల ఖ‌ర్చుల వివ‌రాలు విడుద‌ల అయ్యాయి. పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న త‌రుణంలో ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబుగా ఈ వివారాలు వెల్ల‌డించారు. మోదీ ఖ‌ర్చు ఇప్ప‌టివ‌ర‌కు రూ. 517 కోట్లు అని వెల్ల‌డించారు.

దేశ ప్ర‌ధాని అంటేనే ప్ర‌పంచ దేశాల ప‌ర్య‌ట‌న‌లు, స‌మావేశాలు ఇలా ఉంటాయి. ఈ నేప‌థ్యంలోనే న‌రేంద్ర మోదీ కూడా 2015 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 58 దేశాల్లో ప‌ర్య‌టించారు. ఇందుకోసం రూ. 517 కోట్లు ఖ‌ర్చు అయ్యాయి. దీన్ని స్వ‌యంగా పార్ల‌మెంటు సాక్షిగా కేంద్ర విదేశాంగ వ్య‌వ‌హారాలశాఖ స‌హాయ‌మంత్రి వి.ముర‌ళీధ‌ర‌న్ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబ‌డులు, సాంకేతికం, స‌ముద్రం, అంత‌రిక్షం, ర‌క్ష‌న స‌మ‌న్వ‌యం, ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాలను మెరుగుప‌రిచేందుకు ఆయ‌న కృషి చేశారు. దీని ద్వారా ఎంతో పురోగ‌తి సాధించిన‌ట్లు కేంద్రం పేర్కొంది.

ప్ర‌ధానంగా మోదీ పర్య‌ట‌న‌ల్లో అయిదు సార్లు అమెరికా, ర‌ష్యా, చైనా వెళ్లారు. వీటితో పాటు సింగ‌పూర్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, శ్రీ‌లంక‌, యూఏఈ త‌దిత‌ర దేశాల‌కు వెళ్లారు. ప్రధాని ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల దేశానికి ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఒప్పందాలు, నిర్ణ‌యాలు జ‌రిగాయ‌ని కేంద్రం చెబుతోంది. అయితే ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం విదేశీ ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల ఏం ఒరిగింది లేద‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here