రంగస్థలం సినిమా షో పడిపోతుంది

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీలో తెగ హడావిడి చేస్తోంది…ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా ఘనంగా అభిమానుల మధ్య జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 30వ తారీఖున వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు సినిమా యూనిట్.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమతికోసం నిర్మాణ సంస్థ అభ్యర్థన చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఈ నెల 30న ఉదయం 5 గంటలకు ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 1980 నేపథ్యంలో జరిగిన కథతో తెరకెక్కింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాం చరన్ చెవిటివాడు గా నటిస్తున్నాడు. ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here