మళ్లీ అదే దర్శకుడిని రిపీట్ చేస్తున్న బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా కాని తన ఫోకస్ ఎక్కువగా సినిమాల మీద పెడుతున్నాడు. ఈ క్రమంలో తన మనసు కన్నడ సినిమా మీద పడేసుకున్నాడు బాలయ్య బాబు. కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన  ‘మఫ్టీ’ కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అలాంటి ఈ సినిమాను బాలకృష్ణతో రీమేక్ చేయాలని దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.
ఇంతకుముందు బాలకృష్ణతో ‘జై సింహా’ చేసిన ఆయన .. రీసెంట్ గా బాలకృష్ణను కలిసి ‘మఫ్టీ’ కథ చెప్పారట. ఇంకా ఈ కథపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయకుడు మాఫియా డాన్ గా కనిపిస్తాడట. ఈ సినిమాలో హీరో పాత్ర బాగా నచ్చటంతో బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఉత్సాహపడుతున్నారు. అయితే ఈ సినిమా మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పూర్తవ్వగానే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here