ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్

విభజనకు గురైన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి దాకా గవర్నర్ లేరు రెండు రాష్ట్రాలకు అప్పట్లో ఉన్న గవర్నర్ నరసింహన్ మాత్రమే ఇప్పటిదాకా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండే ఒక మీడియా పత్రికకు రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నట్లు లికులు ఇచ్చారు.
ఈ క్రమంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ను పంపాలనే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు ఆ పత్రిక తెల్పింది .అయితే ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంటు సమావేశాల అనంతరం ఏపీ కి గవర్నర్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు ముహూర్తం కూడా ప్రకటించేసింది ఆ పత్రిక ..అలాగే ఎన్నికలకు ముందు రాష్ట్రానికి హైకోర్టు కూడా ప్రత్యేకంగా ఉండాలని దానికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here