ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటున్న బీజేపీ కాని కండిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తుతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. విభజన నేపథ్యంలో ఆనాడు పార్లమెంట్ సాక్షిగా తెచ్చిన ప్రధాన హామీలను ప్రత్యేక హోదా మొట్టమొదటిది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం బాటలు కూడా పట్టాయి. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేంద్ర ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని కూడా తెలిసింది.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న ..గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాము .కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ..టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు .గత నాలుగు ఏండ్లుగా మట్టి దగ్గర నుండి గాలి వరకు అన్నిటిలో అవినీతి చేస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు .
ఆఖరికి స్కూల్ పిల్లలకు టాయిలెట్స్ నిర్మాణంలో ఆరు వందల కోట్ల రూపాయలను కూడా వదలని ఘనులు అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు ..ఇలాంటివారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here