రానా నిర్మాత గా అఖిల్ సినిమా

అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ అవగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని హలో అంటూ అందరిని అలరించాడు. 2017 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ హలో టాక్ బాగున్నా సినిమా అంత సందడి ఏం చేయలేకపోయింది. అఖిల్ వరకు ట్రాక్ ఎక్కేసినట్టే అనిపిస్తుంది. విక్రం డైరక్షన్ లో వచ్చిన అఖిల్ హలో మూవీని నాగార్జున నిర్మించడం జరిగింది.ఇక ఈ సినిమా తర్వాత మరేమాత్రం గ్యాప్ లేకుండా తన తర్వాత సినిమా ప్రకటించేస్తున్నాడు అఖిల్.
అఖిల్ మూడవ సినిమా ప్రకటన జనవరి 10న చెబుతానని అన్నాడు అఖిల్. ఇక అఖిల్ దర్శకుల రేసులో వంశీ పైడిపల్లి, కొరటాల శివ చివరకు సుకుమార్ కూడా ఉన్నాడని అన్నారు. రీసెంట్ గా మెర్సల్ డైరక్టర్ అట్లీ కూడా అఖిల్ తో సీమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.అయితే ఫిల్మ్ నగర్ లో అసలు టాక్ ఏంటంటే అఖిల్ సత్య పినిశెట్టి డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడట. రవిరాజా పినిశెట్టి తనయుడైన సత్య1 సరైనోడు విలన్ ఆదికి సోదరుడే. సత్య ఇదవరకు మలుపు సినిమా తీసి హిట్ అందుకున్నాడు.
రీసెంట్ గా అఖిల్ ను కలిసి కథ వినిపించాడట సత్య. కథ నచ్చడంతో దాదాపు ఓకే అన్నట్టు కన్ఫాం చేశాడట అఖిల్.ఇక ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను దగ్గుబాటి రానా మీద వేసుకున్నాడని తెలుస్తుంది. అఖిల్ మొదటి సినిమా నితిన్ చేయగా.. రెండో సినిమా నాగార్జున స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు 3వ సినిమా రానా నిర్మాణంలో వస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియదు కాని అఖిల్ మూడవ సినిమా న్యూస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here