ఏపీ విషయం లో పక్షపాతం తో గవర్నర్ !

యూపిఏ హయాంలో  రెండు తెలుగు రాష్ట్రాలు కు  గవర్నర్గా నియమితుడైన నరసింహన్ వివాద రహితుడు,దైవభక్తి గలవాడు సౌమ్యుడు అని రెండు తెలుగు రాష్ట్రాలు లో  మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా గవర్నర్ నరసింహన్ పై  రెండు  తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి నాయకులు గవర్నర్ వైఖరిపై తప్పు పడుతున్నారు….ఈ క్రమంలో గవర్నర్ మిద తమ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి బిజెపి నాయకులు సిద్ధమయ్యారు.ప్రతిసారి రెండు  తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల ను  పిలిపించి సమావేశాలు జరపడం  బిజెపి నాయకులకు మింగుడుపడటంలేదు.
అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గవర్నర్ నరసింహన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు…గవర్నర్ ఏపీ విషయంలో పక్ష పాత ధోరణి అవలంభిస్తూ బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లో ఏపీలో ఒకే తరహా బిల్లులు ప్రవేశపెడితే గవర్నర్ అక్కడ తక్షణం ఆమోదం తెలిపి ఏపీ విషయాన్ని పెండింగ్ లో పెట్టడాన్ని విష్ణుకుమార్ రాజు ఎత్తి చూపుతున్నారు.ఈసారి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here