జై సింహ కి ప్లాప్ సెంటిమెంట్

నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్ల పై విపరీతమైన నమ్మకం. దీనికితోడు బాలయ్య నటించిన సినిమాల టైటిల్స్ దగ్గర నుండి రిలీజ్ డేట్స్ వరకు అనేక సెంటిమెంట్లతో వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఈ నేపధ్యంలో సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘జై సింహా’ సెంటిమెంట్ల పై కొన్ని సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాలకు కలిసి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంట్ ను ‘జై సింహా’ లో కూడ ఉపయోగించడంతో ఈమూవీ పై నిర్మాత సి. కళ్యాణ్ చాల నమ్మకంగా ఉన్నట్లు టాక్.

దీనికితోడు ఈమూవీలో ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్న సంకేతాలు ఇస్తూ లేటెస్ట్ గా బాలకృష్ణ ఈమూవీలో నటిస్తున్న రెండు పాత్రలకు సంబంధించి రెండు గెటప్స్ ను రిలీజ్ చేసారు.బాలయ్య రెండు క్యారెక్టర్స్ తో ఉన్న స్టిల్ ను విడుదల చేశారు. గెటప్స్ పరంగా పెద్దగా తేడా కనిపించకపోయినా ఒక పాత్రకు గెడ్డం ఉంచి మరో పాత్రకు గెడ్డం తీసేశారు. కనీసం ఈ రెండు పాత్రలకు సంబంధించి బాలకృష్ణకు విగ్గు కూడా మార్చలేదు. హీరోయిన్ హరిప్రియ కూడా ఫ్లాష్ బ్యాక్ లోనే వస్తుందంటున్నారు.

దీనితో ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంట్ ను నమ్ముకుని రిలీజ్ చేయబడుతున్న ‘జై సింహా’ పై అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఈమూవీకి పెద్దగా మార్కెట్ జరగని నేపధ్యంలో ఏపీ నైజాంలో కూడా నిర్మాత 70 శాతం సొంత రిలీజ్ తోనే వెళ్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమా అనుకున్న రీతిలో హిట్ కాకపోతే నిర్మాతకు తీవ్ర నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది. మరోవైపు ఇండస్ట్రీలో ఓ వర్గం తనకు థియేటర్లు దక్కకుండా చేసిందని ఈసినిమా నిర్మాత పరోక్షంగా ఆరోపిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఏమైనా కేవలం ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంట్ ఎంత వరకు ‘జై సింహా’ ను రక్షిస్తుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here