చంద్రబాబు పరువు తీసిన గజల్ శ్రీనివాస్

కొండంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ అంటారు. అంత పెద్ద గడ్డివామును తగలబెట్టడానికి ఓ చిన్న అగ్గిపుల్ల చాలు.. ఓ మనిషి వ్యక్తిత్వమూ అంతే.. ఒక మనిషిలో ఎన్ని సద్గుణాలు ఉన్నా.. ఒకే ఒక్క దుర్గుణం.. అంతవరకూ తెచ్చిపెట్టుకున్న కీర్తినంతా ఆవిరిచేస్తుంది. సమాజంలో తలవంచుకునేలా చేస్తుంది. విచక్షణ మరిచి చేసే చిన్న తప్పు జీవితాంతం మాయని మచ్చలా వెంటాడుతూనే ఉంటుంది. అద్భుత గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఉదంతం ఇందుకు సరిగ్గా చక్కటి ఉదాహరణగా మిగిలిపోతుంది. గజల్ శ్రీనివాస్ ఎన్నో దేశభక్తి గీతాలు రచించి పాడాడు.. గాంధీ తత్వాన్ని ప్రచారం చేశాడు.. అమ్మ గొప్పదనాన్ని కమ్మగా వర్ణించాడు. నీ బడిపిలుస్తోంది అంటూ ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం వచ్చేలా చేశాడు.
ఇన్ని సుగుణాలు ఉన్నా.. కేవలం కామాన్ని జయించలేక.. కామాంధకారంతో విశృంఖలత్వంతో ఒక్కసారిగా గలీజ్ శ్రీనివాస్ గా మారిపోయాడు.ఐతే.. ఇప్పుడు గజల్ శ్రీనివాస్ ఉదంతం.. ఇటు ఏపీ సర్కారుకు కూడా తలవంపులు తెచ్చిపెడుతోంది. గజల్ శ్రీనివాస్ కూ ఏపీ సర్కారుకూ లింకేమిటి.. గజల్ శ్రీనివాస్ కటకటాల పాలైతే.. ఏపీ సర్కారుకు తలవంపులు ఎందుకు అన్న ప్రశ్న ఉదయించకమానదు. కానీ గజల్ శ్రీనివాస్.. మహనీయుడుగా.. మంచి సెలబ్రెటీగా ఉన్న రోజుల్లో ఆయన్ను ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నియమించారు. ఇప్పుడు గలీజ్ శ్రీనివాస్ లీలలు వెలుగు చూశాక కూడా అతన్ని ఆ పదవి నుంచి తొలగించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్ లాంటి వ్య్వక్తిని తక్షణమే ప్రభుత్వం స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి తొలగించాలని బిజెవైఎం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తుమ్మల పద్మ విజయవాడలో డిమాండ్ చేశారు. సంఘంలో బాధ్యతగా మెలగవలసి పేరున్న పెద్ద మనుషులు మహిళల అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇటీవల ప్రభుత్వం స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా గజల్ శ్రీనివాస్ ను నియమించిందని గుర్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ లాంటి వారి వల్ల రాష్ట్రానికి తలవంపులు వస్తాయని విమర్శిస్తున్నారు. తక్షణమే శ్రీనివాస్ ను స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here