ఆ వార్తల్లో నిజంలేదు..!

కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు యంగ్‌ హీరో రానా దగ్గుబాటి. తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్న ఈ రానా వారి అబ్బాయి బాలీవుడ్‌లోనూ నటించిమెప్పించాడు. ఇదిలా ఉంటే తాజాగా రానాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. దివంగత నటుడు శోభన్‌బాబు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుందని అందులో రానా హీరోగా నటించనున్నాడన్నది సదరు వార్త సారాంశం. అయితే దీనిపై రానా అధికారికంగా స్పందించలేదు.

ఇక తాజాగా రానా ఈ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రానా సన్నిహితులు స్పష్టం చేశారు. శోభన్‌ బాబు పాత్రకు రానా సెట్‌ కాడని ఆ కారణంగానే సినిమాకు నో చెప్పినట్లు సమాచారం. ఇక రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వంలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియమణి, నందితాదాస్, జరీనా ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్‌ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో పాటు రానా నటించిన హాథీ మేరీ సాధీ (తెలుగులో అరణ్య) విడుదలకు సిద్ధంగా ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here