రమ్యకృష్ణ అంత తీసుకుంటోందా..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు నటి రమ్యకృష్ణ. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు 50 ఏళ్ల వయసులోనూ యంగ్‌ హీరోయిన్లకు పోటీనిస్తూ నటిస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రానిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకుంటోందీ తార.

ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లవుతోన్నా రెమ్యూనరేషన్‌ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర పోషించిన తర్వాత రమ్యకృష్ణ రేంజ్‌ మరింత పెరిగిపోయింది. దీంతో రమ్యకృష్ణ తన రెమ్యునరేషన్‌ కూడా ఓ రేంజ్‌లో పెంచేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రమ్యకృష్ణ రోజుకు రూ.10 లక్షలు తీసుకుంటోందట. ఈ లెక్కన చూసుకుంటే ఒక సినిమాలో పది రోజులు చేసినా రమ్యకృష్ణ సినిమాకు రూ. కోటి వరకు తీసుకుంటుందన్నమాట. రమ్యకృష్ణ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో పాటు, సాయిధరమ్ తేజ్, దేవకట్టా సినిమాలోనూ నటిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here