రామ్ చరణ్ చిన్నపిల్లాడు ఐపోయాడు

పల్లెటూళ్లలో పచ్చదనమే కాదు .. ప్రేమానురాగాలు కనిపిస్తాయి. ఆత్మీయతతో కూడిన పలకరింపులు వినిపిస్తాయి. చిన్నప్పుడు బంధువుల ఇంటికని పల్లెటూళ్లకు వెళితే, ఆ జ్ఞాపకాలు జీవితాంతం అందమైన అనుభూతులను పంచుతూనే ఉంటాయి. అలాంటి అనుభూతే తన సినిమా విలేజ్ సెట్ చూస్తే కలుగుతోందంటూ తాజాగా చరణ్ ఫేస్ బుక్ ద్వారా చెప్పాడు.
 చరణ్ తాజా చిత్రంగా ‘రంగస్థలం 1985’ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ ఇది. హైదరాబాద్ లో వేసిన 1980 కాలం నాటి విలేజ్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ స్పాట్ కి సంబంధించి, పల్లెలోని ఓ వీధి .. పూరిపాక .. కిరాణా కొట్టు .. సోడా బండీ ఫోటోలను ఫేస్ బుక్ లో చరణ్ పోస్ట్ చేశాడు. ఈ విలేజ్ సెట్ చూస్తే 1980 నాటి కాలానికి మీరు వెళతారనీ, తనని కూడా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతోందని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here