సీనియర్ ఎన్టీఆర్ నన్ను మెచ్చుకున్నారు – రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ ఫోటో

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తద్వారా అందరి దృష్టి తన సినిమాపైనే ఉండేలా చేయడంలో సఫలీకృతం అయ్యారు. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఆయన ఓ ఫొటోను అప్ లోడ్ చేశారు.
ఓ కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో ఇది. ఈ ఫొటోలోనే చిన్న బాక్స్ లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలు దండలు మార్చుకుంటుండగా… వారికి సమీపంలో చంద్రబాబు నిలిచి ఉన్న ఫొటోను ఉంచారు. ‘ఆయనపై సినిమా తీస్తున్నందుకు నన్ను ప్రశంసిస్తున్న ఎన్టీఆర్’ అంటూ కామెంట్ పెట్టారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here