బిగ్ బాస్ కి ఈ పిల్ల చుక్కలు చూపించ బోతోంది

హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 11లో ఢించ‌క్ పూజ రాబోతుంద‌ని తెలిసి నెటిజన్లు నానా రకాల కామెంట్లు చేస్తున్నారు. `యూట్యూబ్‌లోనే త‌ట్టుకోలేకపోతున్నాం ఇంకా ప్ర‌తిరోజు నిన్ను బిగ్‌బాస్‌లో చూడాలా?` అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె బిగ్‌బాస్ కోసం చేసిన ఆడిష‌న్ టేప్ ఒక‌టి నెట్లో వైర‌ల్‌గా మారింది.
బిగ్‌బాస్‌ను మండించ‌డానికి వ‌స్తున్నా… సిద్ధంగా ఉండు స‌ల్మాన్ ఖాన్‌.. అని పూజ అన‌డం ఈ వీడియోలో చూడొచ్చు. త‌న‌కు పాజిటివ్‌గా ఉండే వాళ్లంటే ఇష్ట‌మ‌ని, బిగ్‌బాస్ ఇంట్లో కూడా త‌న ప్ర‌వ‌ర్త‌న మార‌ద‌ని పూజ ఈ వీడియోలో అంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌కి సంబంధించిన ఆమె ర్యాప్ చేయ‌డం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
ఇదిలా ఉండ‌గా నిన్న రాత్రి ఢించ‌క్ పూజ ఓ కొత్త పాట విడుద‌ల చేసింది. `ఆఫ్రీన్ ఫాతిమా బెవ‌ఫా హై` అనే పాట‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 15 గంట‌ల్లోనే దాదాపు 75 వేల మంది వీక్షించారు. నిజం చెప్పాలంటే త‌న సూప‌ర్ హిట్ వైర‌ల్ పాట‌లైన `సెల్ఫీ మైనే లేలే ఆజ్‌`, `దిల్లోంకా స్కూట‌ర్` పాట‌ల కంటే ఇది ఇంకా క‌ర్ణ‌కఠోరంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here