జూనియర్ ఎన్టీఆర్ మంచి సినిమా మిస్ అయిపోయావు కదయ్యా ..

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకి ఎక్కించిన రాజ ది గ్రేట్ చిత్రం మొన్న దీపావళి ముందర రోజు ప్రేక్షకుల ముందరకి వచ్చింది. విడుదల అయిన రోజు నుంచీ పాజిటివ్ టాక్ తో నడిచిన ఈ చిత్రం ప్రతీ ప్రాంతం లో కలక్షన్స్ కుమ్మేస్తోంది. అయితే ఈ సినిమా స్టోరీ మొదట హీరో ఎన్టీఆర్ కి వెళ్ళింది అని చెబుతున్నాడు ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కి ఈ చిత్రం సెట్ అవదు అని ఆ కథ ని రవితేజ కి ఇచ్చారట. రవితేజ ఓకే చెప్పగానే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా సిద్దం అయ్యింది.  తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత అదే జోరును కొనసాగిస్తోంది. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసి రవితేజ ఆనందంతో పొంగిపోతున్నాడట.

ఆయనకి మరో హిట్ పడినట్టేననేది ఇండస్ట్రీ టాక్. అప్పట్లో వచ్చిన్ భద్ర సినిమా కూడా ముందు ఎన్టీఆర్ కి వినిపించి నో చెప్పిన తరవాత రవితేజ తో చేసాడు బోయపాటి. మొత్తం మీద మంచి సినిమా మిస్ అయిపోయాడు మా హీరో అనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here