తన తర్వాత సినిమా కోసం రెడీ అయి పోతున్న చెర్రీ

మెగా పవర్ స్టార్  రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యద్భుతమైన కలెక్షన్ లు, రికార్డులు సృష్టించిన సినిమాగా రంగస్థలం నిలిచిపోనుంది. అయితే ఈ క్రమంలో తన తర్వాత సినిమా కోసం రాంచరణ్ సిద్ధపడుతున్నాడు. ప్రముఖ మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  తన పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మలుచుకుంటున్నాడు చెర్రీ. ఇందుకోసం తన సతీమణి ఉపాసన పర్యవేక్షణలో ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ కసరత్తులు చేస్తున్నారు. ‘రంగస్థలం’లో మోటుగా పల్లెటూరి యువకుడిలా కనబడిన చరణ్ ఈ సినిమాలో మాత్రం స్టైలిష్ మెకోవర్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో చెర్రీ పక్కన హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here