ప్రభాస్ సాహో సినిమా హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ

బాహుబలి భారీ విజయంతో దేశం మొత్తం సంచలనమైన ప్రభాస్. తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సాహో సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశం పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. సాహో సినిమాపై అన్ని భాషలు పరిశ్రమల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడ రూపొందిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఉత్తరాదిన రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఒప్పందానికి సంబందించి టి-సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ ప్రభాస్ ను, చిత్ర నిర్మాతల్ని కలవడం కూడ జరిగింది. ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here