ప్రత్యేక హోదా కోసం దీక్షకు కూర్చుండబోతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ 20వ తారీకు నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబు జన్మదినం నాడు దీక్షకు కూర్చుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కి బదులు ప్రత్యేక ప్యాకేజీ మంచిది అన్న చంద్రబాబు…తరువాత రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని బలంగా నమ్మడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఇప్పుడు  ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడాలన్నే నేపథ్యంలో చంద్రబాబు దీక్షకు పూనుకొన్నారు. గత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా పై పలు మార్లు రంగులు మార్చిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని నెపంతో ఇలా చేయడం ఏపీ ప్రజలను మోసం చేయడమని కొంతమంది బాబు దీక్షను హేళన చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే ప్రజలముందు దొంగనాటకాలు దొంగ దీక్షలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here