జగన్ పాదయాత్ర లో ఒక ఫోటోను చూసి బెదిరిపోతున్న చంద్రబాబు

వైసిపి అధినేత ప్రతిపక్ష నేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే కృష్ణాజిల్లాలో సైతం ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు జగన్ ఫాలోయింగ్ చూసి తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు జగన్ చేస్తున్న పాదయాత్రలో భాగంగా విజయవాడలో వారధిపై నడుస్తున్న ఫోటోని చూసి తెగ భయపడిపోతున్నారట. కృష్ణా జిల్లాలో తమ నాయకుడు జగన్ అడుగు పెట్టిన నేపథ్యంలో బెజవాడ కార్యకర్తలు నాయకులు స్వాగత తోరణాలతో ,ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు .

ఈ క్రమంలో జగన్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని వేలమంది జగన్ తో కలసి అడుగులో అడుగు వేస్తూ.. పాదయాత్రలో పాల్గొన్నారు .అందులో భాగంగా జగన్ కనకదుర్గమ్మ వారధిపైకి వచ్చారు. అయితే ఒక్కసారిగా అందరూ (కొన్ని వేలమంది)వంతెనపైకి రావడంతో వంతెన కొంచెం సేపు ఊగినట్లు అయిందని సమాచారం. దారి పొడవునా వైసీపీ అభిమానులతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కనకదుర్గమ్మవారధిపై వైఎస్ జగన్ జనసందోహంతో పాదయాత్రతో వస్తున్నప్పటి ఫోటోన్ని చూసి చంద్రబాబు తెగ భయపడిపోతున్నారట. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రజల మధ్య ఉత్సాహంగా జరుగుతుంది. ఒకపక్క ఎండలు ఉన్నా కానీ జగన్ కోసం ప్రజలు ఎదురు చూస్తుండడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ జోరు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడం ఖాయమన్నట్టుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here