భరత్ అనే నేను సినిమా కాపీ వివాదం పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

భరత్ అనే నేను సినిమా కాపీ అనే వివాదం పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఇటీవల ఈ సినిమా కాపీ అని  కోటి రూపాయలకు దానిని కొని శివ తెరకెక్కిస్తున్నాడని అనేక కామెంట్స్ వినపడ్డాయి..ఈ నేపథ్యంలో కొరటాల శివ భరత్ అను నేను సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. వాటిపై కొరటాల శివ క్లారిటీ ఇస్తూ, అవన్నీ పుకార్లని కొట్టిపడేశారు. తన స్నేహితుడు, కెరీర్‌ తొలినాళ్లల్లో రూమ్‌ మేట్‌ అయిన శ్రీహరి (దర్శకుడు) అప్పట్లో ఒక ఐడియా ఇచ్చాడని చెప్పాడు.

ముఖ్యమంత్రి ముఖ్యపాత్ర అంటూ ఇచ్చిన ఆ ఐడియా తనకు అద్భుతంగా అనిపించిందని శివ తెలిపాడు. ఆ లైన్ ను తాను డెవలప్ చేసుకుని కథను సిద్ధం చేశానని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో అసెంబ్లీలో పదిహేను నిమిషాలపాటు సాగే సన్నివేశం సినిమాకే హైలెట్ అని అన్నారు. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here