పవన్ కళ్యాణ్ రికార్డు బద్దలు కొట్టిన రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి హిట్ టాక్  కైవసం చేసుకుని విడుదలైన ప్రతి చోట్ల అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చెవిటి వాడిగా చరణ్ అద్భుతంగా నటించాడు. రంగస్థలం తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక యూఎస్ లోను ఏ మాత్రం స్పీడ్ తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో చెన్నైలోను ఈ సినిమా తనసత్తా చాటుకుంది. తొలిరోజునే ఒక రికార్డును సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ విషయం పక్కన పెడితే .. చెన్నైలో తొలిరోజున 24 లక్షల గ్రాస్ ను సాధించి ఇంతవరకూ ‘అజ్ఞాతవాసి’ మొదటిస్థానంలో వుంది. ఇక తాజాగా 25 లక్షల గ్రాస్ ను రాబట్టి ‘రంగస్థలం’ మొదటిస్థానంలో నిలిచింది. బాబాయ్ రికార్డును అబ్బాయ్ క్రాస్ చేయడం విశేషమే. ప్రస్తుతం కలెక్షన్లు చూస్తుంటే త్వరలోనే 100కోట్లు రాబట్టబోతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here