మహేష్ సినిమా ఆడియో వేడుకలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ముఖ్య అతిధులు

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న భరత్ అనే నేను సినిమా తెలుగు సినిమా రంగంలో అనేక సంచలనం సృష్టిస్తోంది. శ్రీ మధ్య ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా అనేక రకాలు ను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7వ తారీఖున సూపర్ స్టార్ అభిమానుల మధ్య భరత్ అనే నేను ఆడియో వేడుక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. ఈ సందర్భంగా ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా రాంచరణ్ ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నారు.
మహేష్ – తారక్ – చరణ్ ముగ్గురు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఆ కిక్కు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. నిర్వాహకుల సమాచారం ప్రకారం చరణ్ తారక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందు నుంచే మహేష్ చరణ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే భరత్ అనే నేను సినిమాకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. పైగా చరణ్ తో తారక్ మల్టి స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ కనువిందు దృశ్యం చూడడానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఉబలాటపడుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here