చరణ్-ఎన్టీఆర్ లు హీరోగా చేస్తున్న రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ చరణ్ మల్టీస్టారర్ సినిమా హాట్ టాపిక్ అయింది. బాహుబలి వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న సినిమా నేపథ్యంలో ఈ సినిమాపై చాలా ఇండస్ట్రీ వారు కన్ను వేశారు. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీ నుండి బయటకు వస్తుంది. రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే తారక్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది.
ఇంతకుముందు జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించాడో అందరికి తెలిసిందే. జై పాత్రలో రావణుడి షేడ్స్ ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ తో కనిపించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే రాజమౌళి తనదైన శైలిలో చూపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలోనే అధికారికంగా షూటింగ్ కార్యక్రమాలు మొదలవుతున్న ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here