కృష్ణా జిల్లాలో కీలక నేత వైసీపీ పార్టీ లోకి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసిపి అధినేత జగన్ తలబెట్టిన పాదయాత్ర రాష్ట్రంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రజల మధ్య ఆధర్ అభిమానులతో ముందుకు సాగుతోంది. జగన్ కి ప్రతీ చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో రోజురోజుకి రాష్ట్రంలో వైసీపీ పార్టీ బలపడుతోంది…జగన్ పెట్టిన ప్రతి చోటా సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు….అలాగే చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత ప్రజలలో బాగానే కనబడుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కృష్ణా జిల్లాలో అడుగుపెడుతున్న జగన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో ఉన్న చాలా మంది తెలుగుదేశం నాయకులు వైసీపీ పార్టీ లోకి రావాలనుకుంటున్నారు…ఇటీవలే వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ నిమ్మ‌కాయ‌ల ఆదినారాయ‌ణ‌, మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ ఆతుకూరి నాగేశ్వ‌ర‌రావు, అంత‌కు ముందు, జ్యోతుల చంటిబాబు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.

అయితే, తాజాగా వారి బాట‌లోనే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత య‌ల‌మంచిలి ర‌వి వైసీపీలో సిద్ధ‌మ‌య్యారు. అందుకు ముహూర్తాన్ని కూడా ఖ‌రారు చేసుకున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఏప్రిల్ 10వ తేదీన కృష్ణా జిల్లాలోని విజ‌య‌వాడ‌లో వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరనున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన య‌ల‌మంచిలి ర‌వికి కృష్ణాజిల్లాలో మంచి పేరుంది…దీంతో రవి వైసీపీ లోకి రావడం తెలుగుదేశం పార్టీకి పెద్ద గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here