అద్భుతంగా అయోధ్య ఆల‌య న‌మూనా

అయోధ్య‌లో అంగ‌రంగ వైభవంగా నిర్మాణం జ‌రుగ‌నున్న రామాల‌యం న‌మూనాను శ్రీ‌రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు విడుద‌ల చేసింది. శిల్ప‌క‌ళా నైపుణ్యాన్ని చాటాలే ఉన్న ఆల‌య డిజైన్ ఆక‌ట్టుకుంటోంది.

రేపు అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రుగ‌నున్న త‌రుణంలో ఆల‌య న‌మూనాను ఆల‌య ట్రస్టు విడుద‌ల చేసింది. ఆల‌యాన్ని161 అడుగుల ఎత్తులో మూడు అంత‌స్థుల రాతి క‌ట్ట‌డంలో గోపురాలు, స్థంబాల‌తో నిర్మించ‌నున్నారు. ఆల‌యంలో ఒకేసారి ల‌క్ష మంది భ‌క్తులు స‌మావేశం అయ్యేట్లు నిర్మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఆల‌యంలో మొత్తం ఐదు గుమ్మాలుండ‌నున్నాయి. ఈ ఆల‌యం నిర్మాణానికి ఐదు సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ముందుగా అనుకున్న న‌మూనా కాకుండా మ‌రింత అభివృద్ధి చేసి ఆల‌య న‌మూనాను త‌యారు చేశారు. ఈ ఆల‌యాన్ని సోమ్‌పుర, సోమ‌నాథ్‌, అక్ష‌ర్‌థామ్ ఆల‌యాల‌ను రూపొందించిన చంద్ర‌కాంత్ రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here