తిరుమ‌ల‌లో ట్రాఫిక్ పోలీసుల‌పై చిరుత దాడి..

తిరుమ‌ల‌లో చిరుత పులి హ‌ల్‌చ‌ల్ చేసింది. క‌రోనా స‌మ‌యంలో జ‌న సంచారం లేక‌పోవడంతో చిరుత‌లు రోడ్ల‌పైకి వ‌స్తున్నాయి. దీంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

తిరుమ‌ల‌లో చిరుత సంచ‌రిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే చాలా సార్లు స్థానికులు గ‌మ‌నించారు. అయితే నేడు తిరుమ‌ల రెండో క‌నుమ దారిలో చిరుత రోడ్ల‌పైకి వ‌చ్చింది. తిరుమ‌ల‌కు చేరుకునే నాల్గ‌వ కిలోమీటరు వ‌ద్ద ట్రాఫిక్ పోలీస్ తో పాటు, మ‌రో వ్య‌క్తిపై చిరుత దాడికి య‌త్నించింది.

అయితే వెంట‌నే తేరుకున్న వీరు కొండ‌పై నుంచి త‌ప్పించుకు వెళ్లారు. అనంతరం అటువైపుగా ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌లు ఆపివేశారు. మ‌రోసారి చిరుత రోడ్ల‌పైకి రావ‌డంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విష‌యం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది, అట‌వీ సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here