అంద‌రి ఆశీస్సులు కావాలి.. పృధ్వీ రాజ్

సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సినీ న‌టుడు పృధ్వీ రాజ్ ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విష‌యాన్నే ఆయ‌నే స్వ‌యాన ప్ర‌క‌టించారు.

ఎప్పుడూ న‌వ్వించేలా మాట్లాడే పృధ్వీ క‌రోనా బారిన ప‌డి సెల్ఫీ వీడియో పంప‌డం బాధాక‌రం. కాగా
ప‌ది రోజుల నుంచి తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ఆయ‌న‌ చెప్పారు. కొన్ని చోట్ల టెస్టులు చేపించాను. అయితే ప‌లు చోట్ల కోవిడ్ నెగిటివ్ వ‌చ్చింద‌న్నారు. కొన్ని కేసుల్లో నెగిటివ్ వ‌స్తుంద‌ని వైద్యులు చెప్పార‌ని.. అందుకే డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు మేర‌కు 15 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాన‌ని చెప్పారు.

నిన్న అర్ద‌రాత్రి నుంచి క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. తాను కోలుకునేందుకు మీ అంద‌రి ఆశీస్సులు కావాల‌న్నారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆశీర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఫృద్వీ చెప్పారు.

మ‌హిళ‌కు కొత్త ఇల్లు కొనిస్తా.. సోనూసూద్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here