పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్

తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు పవన్ కళ్యాణ్ చేపడుతున్నా యాత్రకు తాము మద్దతు తెలుపుతున్నరు. అయితే ఇప్పటివరకు మెగా కుటుంబం నుండి పవన్ కళ్యాణ్ కు ఎటువంటి మద్దతు రాలేదు.
ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించడం జరిగింది.బాబాయ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేనకు జై కొట్టేశాడు.తన పేస్ బుక్ పేజీ లో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చలోరే చలోరే చల్ యాత్రకు మద్దత్తు ప్రకటించారు. బాబాయ్ చలోరే చలోరే చల్ యాత్రని అద్భుతంగా ప్రారంభించారని ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ నుంచి నైతిక మద్దత్తు అందినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here