రాజకీయాల వల్ల పవన్ సినిమాలకు దూరం ?

సినీనటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాయాత్ర పర్యటనలో బిజీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సంసిద్ధం చేయడానికి అధ్యక్షుడిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్  పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా రాజకీయాలలో రాణించాలని అనుకొంటున్నారు. అయితే పవన్ సినిమాల గురించి ఇక ఆలోచించనని ప్రస్తుతానికి పక్కన పెట్టేసానని తెలియజేశాడు. దీంతో ప్రస్తుతం మెగా అభిమానుల్లో కొంచెం ఆందోళన నెలకొంది. గతంలో కూడా గత కొద్దికాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కాబోతున్నాడు అనే రూమర్స్ చాలా వచ్చాయి.

దీంతో అప్పట్లో చాలామంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కావడం తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అప్పట్లో పవన్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి కూడా, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్న సినిమాలు వదిలి పెట్టవద్దని చిరంజీవి పవన్ కళ్యాణ్  కి సలహా ఇవ్వడం మనందరికీ తెలుసు.అయితే తాజాగా పవన్ తెలంగాణలో జరిపిన మీడియా సమావేశంలో డైరెక్ట్ గా సినిమాల గురించి ఇప్పుడు అంతగా ఆలోచించడం లేదని క్లియర్ గా చెప్పాడు. ఇంకా ఎలక్షన్స్ కి ఒక ఏడాది మాత్రమే ఉంది. పైగా ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో నేతలు చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. దీంతో పవన్ కూడా సినిమాల గురించి రెండేళ్ల వరకు ఆలోచించే పరిస్థితుల్లో లేడని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here