అనుకున్నట్లే మహేష్ ఆ రికార్డ్ అందుకున్నాడు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో గతంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. మహేష్ కెరీర్లోనే శ్రీమంతుడు సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో భారీ అంచనాల మధ్య వస్తున్న “భరత్ అనే నేను” విడుదలకు ముందే అనేక సంచలనాలు సృష్టిస్తుంది. “భరత్ అనే నేను” సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. సినిమా శాటిలైట్ హక్కులు మొత్తంగా రూ.39 కోట్లకు అమ్ముడు పోయాయి.

ఇంతవరకు మహేష్ కెరీర్లో ఏ సినిమాకు ఈ స్థాయిలో అఫర్ రాలేదు. దీంతో “భరత్ అనే నేను” సినిమా నిర్మాతకు విడుదలకు ముందే మంచి లాభాలు అందుతున్నాయి. ఇక గత కొన్ని రోజుల క్రితం ఆడియో హక్కులు కూడా మంచి రేట్ గా అమ్ముడు పోగా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here