తెలంగాణలో ‘పద్మావతి’ విడుదలవడం కష్టమే

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావతి చిత్రం దేశంలో అనేక సంచలనాలు వివాదాలు సృష్టించింది. పద్మావతి సినిమా వల్ల రాజ్ పుత్ మనోభావాలు దెబ్బతిన్నాయని అప్పట్లో కర్ణిసేన ఆరోపించడం జరిగింది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డ్ ఈ విషయం లో కలుగజేసుకుని సినిమా లో కొన్ని మార్పులు చేసి రాజ్ పుత్ లను కించపరిచే సన్నివేశాలు ఏమీ లేవని సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా కర్ణి సేన, రాజ్ పుత్ ఆందోళన విరమించకపోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమాను బ్యాన్ చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో పద్మావతి సినిమా యూనిట్ సుప్రీంకోర్టు కి వెల్లడం జరిగింది. సినిమాను అన్ని రాష్ట్రాలలో విడుదల చేయాలని, కోర్టు కూడా అన్ని రాష్ట్రాలలో విడుదల చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ప్రస్తుతం పద్మావతి సినిమా సెగ తెలంగాణ రాష్ట్రానికి తాకింది. హైదరాబాదులోని అగపుర వద్ద ఉన్నా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం వద్ద పద్మావతి సినిమాను విడుదల చేయవద్దని ఆందోళన నిర్వహించారు రాజపుత్ యువకులు. సినిమాను విడుదల చేస్తే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు రాజపుత్ యువకులు. ఈ సందర్భంగా పద్మావతి పోస్టర్లను కాల్చి తమ ఆందోళనను తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here