నేనెప్పుడూ రికార్డుల గురించి ప‌ట్టించుకోను: బాల‌కృష్ణ‌

సంక్రాంతి పండగ పురస్కరించుకుని బాలకృష్ణ విడుదల చేసిన ‘జైసింహ’, సినిమా విజయం సాధించడంతో ‘జై సింహ’ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఆత్మీయ సభ ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సందర్భంగా “జై సింహ” 50 కోట్ల క్లబ్ లో చేరినట్లు వెల్లడించింది సినిమా యూనిట్. దీంతో బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నడు. ఈ సందర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ ”నా సినిమాలు చాలా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి. చాలా హిట్ట‌య్యాయి.

అయితే నేనెప్పుడూ వాటి గురించి ప‌ట్టించుకోను. మంచి సినిమా తీయాలి, త‌ద్వారా సినీ ప‌రిశ్ర‌మ బాగుండాల‌న్న‌దే నా ఆశ‌. జ‌యాప‌జ‌యాలు మ‌న చేతుల్లో ఉండ‌వు. అది దైవాదీనాలు. ఓ విజ‌యం వ‌స్తే పొంగిపోవ‌డం, ప‌రాజ‌యం పాలైతే కృంగిపోవ‌డం ఇవి రెండూ ఉండ‌వు. సినిమాని సినిమాగానే చూస్తా. జై సింహా విజ‌యం మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజ‌యంతో అంద‌రి క‌ళ్ల‌లో ఆనందాన్ని చూశా” అన్నాడు బాల‌య్య‌. అయితే ప్రస్తుతం బాలకృష్ణ  ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here