మాకు రంగస్థలం నచ్చలే

ద్రువ సినిమా తర్వాత రాంచరణ్ చేస్తున్న సినిమా రంగస్థలం.. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది..సమంత హీరోయిన్ గా చేస్తుంది..అయితే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది..
మెగా హీరో రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం రంంగస్థలం..ఈ సినిమా టైటిల్ ఇటివలే పెట్టారు.. 1985 లో జరిగిన కథగా విలీజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.. రాజమండ్రీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది..అయితే ఈ సినిమా టైటిల్ ను ఇటివలే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది..
రంగస్థలం టైటిల్.. చిత్ర యూనిట్ కు బాగానే నచ్చింది..అయితే మెగా ఫ్యాన్స్ కు మాత్రం అసలు నచ్చలేదనే న్యూస్ వైరల్ అవుతుంది.. దీంతో మెగస్టార్ చిరంజీవి కూడ టైటిల్ అసలు బాగా లేదన్నాడని అంటున్నారు.. రంగస్థలం అంటే ఏదో నాటకం గురించి చెప్తున్నట్లు వుందని వెంటనే టైటిల్ మార్చమని చిత్ర యూనిట్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడంటా చిరు..
వాయిస్..
తమకు ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ శాతం మాస్ అని..వాళ్ళని ద్రుష్టిలో పెట్టుకోని సినిమాలు చేయాలని సుకుమార్ తో అన్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..టైటిల్ కొత్తది దొరక్కపోతే తను నటించిన 150 సినిమాల్లో వున్న మంచి టైటిల్ తీసుకోని పెట్టుకోమని సుకుమార్ తో అన్నట్లు తెలుస్తుంది..అయితే సుకుమార్ ఆండ్ చెర్రీ మాత్రం టైటిల్ బాగానే వుంది.. మార్చవద్దని.. టైటిల్ గురించి బాగానే ఆలోచించి చాలా మంది అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే టైటిల్ పెట్టామన్నారంటా..
చిరు మాత్రం అసలు టైటిల్ సాటిస్పయి కాలేకపోతున్నాడంటున్నారు..కానీ ఒకసారి పెట్టిన టైటిల్ మళ్ళీ మారిస్తే వేరే విధంగా ఫీడ్ బ్యాక్ వెళ్తుందని.. రంగస్థలం టైటిల్  ఇప్పటికే అందరికీ రీచ్ అయిందని,అంతే కాదు మెగా ఫ్యాన్స్ కూడ రిసీవ్ చేసుకుంటారని వాదిస్తున్నాడంటా సుకుమార్…మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం రంగస్థలం టైటిల్ గురించి బాగానే న్యూస్ వైరల్ అవుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here