రాజమౌళి కోసం నాగార్జున తీసుకున్న సంచలన నిర్ణయం

ప్రతిష్టాత్మక ఏఎన్నార్ అవార్డ్ ని సంచలన డైరెక్టర్ రాజమౌళి కి ఇవ్వడానికి నాగార్జున ఫిక్స్ చేసారు. ఈ విషయం మీద నాగార్జున స్పందిస్తూ ఈ నెల 17 న ఉపరాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డులు ప్రధానం చేస్తాం అనీ రాజమౌళి కి ఈ అవార్డు ఇవ్వడం గర్వంగా ఉంది అనీ అన్నారు. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా వినపడుతూ ఉన్నాయి. రాజ‌మౌళి స‌మ‌ర్థుడైన ద‌ర్శ‌కుడే. ప్ర‌స్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ లిస్టులో…. తొలి స్థానాల్లోనే క‌నిపిస్తాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పాడు. భార‌తీయ సినిమా ప్ర‌తిష్ట పెంచాడు. బాహుబ‌లి సినిమాతో గ‌ర్వ‌ప‌డే లా చేశాడు. ఏఎన్నార్ పుర‌స్కారానికి అక్ష‌రాలా అర్హుడు. కాక‌పోతే… రాజ‌మౌళి కంటే సీనియ‌ర్లు చాలామందే ఉన్నారు. కె.రాఘ‌వేంద్ర‌రావు, విశ్వ‌నాథ్ లాంటి వాళ్ల‌ని మ‌ర్చిపోయాడు నాగార్జున‌. దీంతో.. విమ‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చినట్టైంది. అక్కినేని స‌మ‌కాలికులు కృష్ణ కూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏఎన్నార్ అవార్డు ప్ర‌క‌టించ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here