డీజే దెబ్బకి రామ్ చరణ్ కి నిద్ర కూడా పట్టట్లేదు ..

దువ్వాడ జగన్నాథం సినిమా లాంగ్ రన్ ఉంటుందా పెట్టిన డబ్బు వెనక్కి వస్తుందా అనే విషయాలు పక్కన పెడితే ఈ సినిమా ఓపెనింగ్ లు మాత్రం హీరో రామ్ చరణ్ కి పెద్ద తలనొప్పిగా మారింది. రామ్ చరణ్ గత చిత్రం ధృవ టోటల్ కలక్షన్ లు బన్నీ తన కొత్త సినిమాతో కేవలం వారం రోజుల్లో చుట్టేయ్య బోతున్నాడు. ఈ నేపధ్యం లో రామ్ చరణ్ కి బన్నీ నుంచి ఊహించని పోటీ ఏర్పడింది. మెగా ఫామిలీ లో కుర్ర హీరోలు అయిన చరణ్ – బన్నీ లు పవన్ కళ్యాణ్ తరవాత మెగా లెగసీ ని మొయ్యాల్సి ఉంది.

అయితే చరణ్ కంటే ముందుగా బన్నీ దూసుకుని పోతూ ఉన్నాడు అనీ , చిరంజీవి, పవన్‌ తర్వాత మెగా ఫ్యామిలీని మోసేది అల్లు అర్జునే అని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తరవాత వచ్చిన సినిమా ధృవ సో ఆ టైం లో కలక్షన్ లు తక్కువ రావడం చిన్న విషయమే. ఓన్ విడుదల కూడా చేసారు కాబట్టి కలక్షన్ లలో పారదర్సకత సరిగ్గా ఉండదు. ఏదేమైనా చరణ్ కీ బన్నీ కీ పోటీ గట్టిగా నడుస్తూ ఉండడం , చరణ్ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన ఒత్తిడి ఉండడం తో అతను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here