వెధవ ప్రయోగాలు మానుకో .. హీరో కి ఫాన్స్ ఓపెన్ వార్నింగ్ :

ఇండియా లో దాదాపు ఏ హీరోకీ లేని ఒక పాజిటివ్ థింగ్ సల్మాన్ ఖాన్ కి ఉంది. మాస్ సినిమాలు చేసుకుంటే సూపర్ మాస్ ఫాలోయింగ్ చేతిలో ఉండగా ఒక్క మాస్ చిత్రమే అతనికి రెండొందల యాభై కోట్ల వరకూ ఇచ్చి తీరుతుంది. మరే హీరో మాస్ సినిమా చేసినా జనం చూడరు . మరొక పక్క కాస్త డిఫరెంట్ సినిమా తీసినా ఈ మాస్ జనాలతో పాటు ఫామిలీ లు కూడా భాయ్ అంటూ ఎగబడుతూ ఉంటారు. మిగిలిన హీరోలకి లేని ఆ ఛాన్స్ తనకి మాత్రమే ఉండగా సల్మాన్ ఖాన్ మాత్రం ఈ మధ్య కాలం లో తాను కూడా గొప్ప నటుడిని అనిపించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాడు.

బజరంగి భాయ్‌జాన్‌కి మంచి కథ కుదరడంతో అది మంచి హిట్‌ అయింది. దీంతో అమీర్‌ఖాన్‌లాగా వెరైటీ సినిమాలు చేయాలనే కోరిక సల్మాన్‌కి పుట్టింది. అలాంటి క్యారెక్టర్ ఉన్న ట్యూబ్ లైట్ చిత్రం చేసి చతికిల పడ్డాడు. మాస్ సినిమా చేసుకోక ఎందుకొచ్చిన ప్రయోగాలు అంటూ సల్మా ఫాన్స్ ఓపెన్ గానే సల్లూ ని తిడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here