వీఐపీ 2 .. ట్రైలర్ చూసి ప్లాప్ అంటున్నారు !

వీఐపీ , రఘువరన్ బీటెక్ ఈ రెండు పేర్లు ఒక్క సినిమావె .. ధనుష్ హీరోగా చేసిన ఈ సినిమా పేర్లు చెబితే చాలు తెలుగు, తమిళ యువత పిచ్చెక్కిపోతారు . ఒక నిరుద్యోగి జీవితం ఎంత దారుణంగా ఉంటుంది అనేది చూపిస్తూ సాగిన ఈ సినిమా అప్పట్లో సంచలనమే రేపింది. ధనుష్ పక్క అమలపాల్ యాక్టింగ్ అతని తల్లిగా శరణ్య నటన , ఆ తల్లి చనిపోవడం తో చిన్నా భిన్నం అయిన అతని జీవితం. వెంటనే మంచి ఉద్యోగం రావడం అక్కడ ఎదురైన ఇబ్బందులు. చివరికి ఒక నిరుద్యోగి గొప్ప ఉద్యోగిగా ఎలా మారాడు అనేది ఈ చిత్రం కథ. ఈ కథ కి తెలుగు ,

తమిళ నిరుద్యోగ యువత విపరీతంగా కనక్ట్ అయ్యారు. దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇప్పుడు సీక్వెల్ తో రాబోతున్నారు ఈ సినిమా మేకర్ లు. ధనుష్ స్వయంగా కథ ఇచ్చిన ఈ చిత్రానికి వీఐపీ 2 అనే పేరు పెట్టారు. ట్రైలర్ విడుదల చెయ్యగా అది అంత ఆసక్తికరంగా లేదు అనేది ప్రధాన కంప్లైంట్ గా వినిపిస్తోంది. మళ్ళీ ఉద్యోగం కోల్పోయి చికెన్ పట్టుకొచ్చే పెళ్ళయిన కుర్రాడిగా మారిన ధనుష్ పరిస్థితుల ప్రభావం తో ఉద్యోగం వెతకాల్సి ఉంటుంది. ఈ సారి ఇతని జీవితం లోనికి లేడీ విలన్ – హిందీ హీరోయిన్ కాజోల్ రూపం లో వస్తుంది. ట్రైలర్ అంత ఆసక్తికరంగా అయితే లేదు. సీక్వెల్ సినిమాలు ప్లాప్ లు అవుతున్న ఈ రోజుల్లో దీని పరిస్థితి కూడా అంతే కాబోలు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here