ముందు ర‌కుల్‌.. త‌ర్వాత ఎవ‌రు.

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ దూకుడు పెంచారు. క‌రోనా నేప‌థ్యంలో షూటింగ్‌ల‌కు అంతా జ‌రుగుతున్న ఈ త‌రుణంలో ఆమె ముందు వ‌రుస‌లో నిలిచారు. నేను ముంతు నా త‌ర్వాత ఎవ‌రు అన్న‌ట్లుగా ఆమె ధైర్యంగా షూటింగ్‌లు ఖ‌రారు చేసుకుంటున్నారు.

ర‌కుల్ ప్రీత్‌సింగ్ వికారాబాద్‌లో బిజీగా ఉంది. క్రిష్ డైరెక్ష‌న్‌లో హీరో వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో ఆమె న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జ‌రుగుతోంది. కంటిన్యూగా నెల‌న్న‌ర పాటు ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె డేట్స్ ఇచ్చేసింద‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌. క‌రోనా స‌మ‌యంలో పెద్ద పెద్ద హీరోలే సినిమాలు ఆపేసుకొని ఇంట్లో కూర్చుంటున్న ప‌రిస్థితులు మ‌నం చూస్తున్నాం.

కానీ ర‌కుల్ మాత్రం ధైర్యంగా షూటింగ్‌ల‌కు రెడీ అవుతున్నారు. ఇక క్రిష్ సినిమాకు కాస్త గ్యాప్ ఇవ్వాల‌ని ఆమె నిర్ణ‌యించున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లోగా హీరో అర్జున్ క‌పూర్‌తో సినిమాలో కూడా ర‌కుల్ న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 24న జ‌రుగుతోంది. ఇందుకోసం కూడా ర‌కుల్ ప్రీ ప్లాన్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ర‌కుల్ లేని సీన్ల‌ను క్రిష్ డైరెక్ష‌న్ చేసుకుంటారు.

ఇవి కాకుండా బాలివుడ్‌లో కాషివే నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌కుల్ న‌టిస్తోంది. ఇందుకోసం కూడా ర‌కుల్ సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ముంబై టు హైద‌రాబాద్ ఆమె షూటింగ్‌ల కోసం జ‌ర్నీ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి ఈ క‌రోనా సీజ‌న్‌లో సినిమాలు చేస్తూ అంద‌రితో ధైర్య‌వంతురాలు అనిపించుకుంటోంది ర‌కుల్‌. మ‌రి ర‌కుల్ త‌ర్వాత ఏ హీరోయిన్లు సినిమాలు తీయ‌డానికి ముందుకు వ‌స్తారో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here